వరంగల్ పట్టణంలో జరుగుతున్న రాహుల్ రైతు సంఘర్షణ సభకు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దారిపోడవునా డప్పు చప్పుల్లతో.. కాంగ్రెస్ శ్రేణుల జేజేలతో హన్మకొండ పట్టణం అంతా దద్దరిళ్లిపోయింది.
తమ అభిమాన నేత రాహుల్ గాంధీ తెలంగాణకు రావడంతో పార్టీ నేతల్లో అభిమానం ఉప్పొంగిపోయింది. పార్టీనేతకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని నలుమూలల నుండి పార్టీ అభిమానులు భారీగా తరలివచ్చారు.
ఉప్పొంగిన పార్టీ కార్యకర్తలతో వరంగల్ అంతా మూడు రంగుల జెండాలతో కలకలలాడింది. సభాప్రాంగణానికి వచ్చే కార్యకర్తలతో సుమారు 25 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అయితే.. ట్రాఫిక్ పేరుతో సభకు వస్తున్న పార్టీ కార్యకర్తల వాహనాలను అడ్డుకున్నారు పోలీసులు. సభ ప్రాంగణానికి సుమారు 10 కిలో మీటర్ల మేర పార్కింగ్ ప్లేస్ ను ఏర్పాటు చేయడంతో సభ వద్దకు చేరుకునే సరికి ఆలస్యం అయిందని పార్టీ కార్యకర్తలు అవేదన వ్యక్తం చేశారు.