కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) కీలక సమావేశాన్ని నేడు నిర్వహించనున్నారు. దేశంలోని రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించేందుకు గత నెలలో ఆరు ప్యానెల్స్ ను పార్టీ ఏర్పాటు చేసింది.
ఆ ప్యానెల్స్ చేసిన ప్రతిపాదనలను ఈ రోజు సమావేశంలో ఖరారు చేయనున్నారు. మే 13న జరిగే కాంగ్రెస్ మేధోమథన సమావేశం(చింతన్ శివిర్)లో ఈ ప్రతిపాదనలపై చర్చించనున్నారు.
ద్రవ్యోల్బణం, ఆర్థిక పరిస్థితి, అధిక నిరుద్యోగ రేటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వంటి ఇతర అంశాలపై చర్చించడానికి ఈ సమావేశం సీడబ్ల్యూసీకి అనుమతి ఇవ్వనుంది.
‘ మేధోమథన సమావేశం చాలా ప్రాముఖ్యమైనది. పార్టీకి పునర్ వైభవం తీసుకురావడం, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించడం, అనేక సామాజిక, ఆర్థిక అంశాలపై ఇందులో చర్చిస్తారు’ అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.