ప్రతిపక్షం, స్వపక్షమన్న తేడా లేకుండా కరోనా వైరస్ సమయంలో ప్రధాని చర్చిస్తుంటే… సీఎం కేసీఆర్ అన్నీ తనకే తెలుసన్నట్లు ఎవరితోనూ చర్చించటం లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించాడు. పూటకో మాట చెబుతూ బాధ్యత లేకుండా సీఎం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
మొదట పారాసిటమాల్ చాలని, తర్వాత ఏప్రిల్ 7 అని, ఇప్పుడు జూన్ అంటూ పూటకో మాట చెబుతున్నాడని… ఆయన మాటలు ఆయనకే సిగ్గేసేలా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య సంస్థలను ఎందుకు కరోనా కోసం ఉపయోగించుకోవటం లేదని రేవంత్ ప్రశ్నించాడు. రాష్ట్రంలో ప్రముఖ డాక్టర్లు నాగేశ్వర్, సోమరాజు, గురువా రెడ్డి వంటి వారితో సీఎం కనీసం మాట్లాడలేదని, ప్రతిపక్షాల సలహా కూడా అడగలేదన్నారు.
సీఎం సహాయ నిధికి ఎన్నో విరాళాలు వస్తున్నందున… పేదల పట్ల ఉదారంగా ఉండాలని, రేషన్ కార్డు, బయోమెట్రిక్ తో సంబంధం లేకుండా రేషన్ సప్లై చేయాలని రేవంత్ రెడ్డి సూచించారు. రోజు వారి కూలీలకు నిత్యవసరాలు ఇస్తే రోడ్లపైకి రారని, వారిని ఆదుకోవాలన్నారు.
మొత్తం సీఎంకు, ఆయన కొడుక్కే తెలుసన్నట్లు మాట్లాడుతున్నారు… ఇది విమర్శించే సమయం కాదని సంయమనం పాటిస్తున్నామని, కేసీఆర్ తప్పుడు నిర్ణయాలను పాటిస్తే కరోనా రావాలని శాపాలు పెడుతున్నారన్నారు.