తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం చోటు చేసుకుంది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. దీంతో పవన్ స్పృహ తప్పి కిందపడిపోయాడు. వెంటనే అతడ్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆస్పత్రికి తరలించారు.
పవన్ పై ఎవరు దాడి చేశారనేదానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలో పవన్ పాల్గొన్నాడు. రేవంత్ రెడ్డి మాట్లాడే సమయంలో ఒక భవనంపై నుంచి ఫ్లెక్సీని ప్రదర్శించాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేను విమర్శించేదిగా ఆ ఫ్లెక్సీ ఉండటం గమనార్హం.
అయితే, కాంగ్రెస్ సభ ముగిసే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పవన్‌పై దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పవన్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలిసింది.
పవన్‌పై జరిగిన దాడిని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. తోట పవన్‌పై టీఆర్ఎస్ నేతల దాడి అమానుషమని యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేనారెడ్డి అన్నారు. పవన్‌ను పరామర్శించి పరిస్థితులు తెలుసుకునేందుకు హుటాహుటిన వరంగల్ బయలుదేరారు యూత్ అధ్యక్షులు శివసేనారెడ్డి.