కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరానికి సీబీఐ కోర్టు షాక్ ఇచ్చింది. వీసా కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ముందస్తు బెయిల్ ను కోర్టు తిరస్కరించింది.
ఆయనతో పాటు ఈ కేసులో భాస్కర్ రామన్ తో పాటు, వికాస్ మకారియాల ముందస్తు బెయిల్ పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. సరైన కారణం లేదనందున దరఖాస్తును అనుమతించలేమని న్యాయమూర్తి తెలిపారు.
లోక్ సభ ఎంపీ, కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరంపై ఈడీ ఇటీవల మరో కేసు దాఖలు చేసింది. ఆయన తండ్రి చిదంబరం హోం మంత్రిగా ఉన్న సమయంలో 2011లో 263 మంది చైనీయులకు వీసాల జారీకి సంబంధించి అక్రమాలకు పాల్పడ్టట్టు ఈడీ ఆరోపణలు చేసింది.
వీసాల జారీ కోసం చైనీయుల దగ్గర నుంచి రూ. 50 లక్షలు అక్రమంగా వసూలు చేశారనే సీబీఐ ఆరోపణలు చేసింది. ఆయన తన పరపతిని, అధికారాన్ని దుర్వినియోగ పరిచారని సీబీఐ పేర్కొంది.