బీజేపీని తాను గురువుగా భావిస్తానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఏం చేయకూడదో బీజేపీ తనకు నేర్పుతోందన్నారు. కాషాయ పార్టీ తనకు రోడ్ మ్యాప్ చూపిందన్నారు. మీడియా సమావేశంలో ఈ రోజు ఆయన మాట్లాడారు….
బీజేపీ తమపై దూకుడుగా దాడి చేయాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అప్పుడే ఆ పార్టీ సిద్దాంతాన్ని అర్థం చేసుకోవడానికి తమకు సహాయం చేస్తుందన్నారు. తాను బీజేపీని గురువుగా భావిస్తున్నానన్నారు. ఎప్పుడు ఏం చేయకూడదో తన ఆ పార్టీ శిక్షణ ఇస్తోందన్నారు.
భారత్ జోడో యాత్రపై ఆయన మాట్లాడుతూ… తాను ఈ యాత్రను ప్రారంభించినప్పుడు దీన్ని ఓ సాధారణ యాత్రగానే తీసుకున్నానని వెల్లడించారు. కానీ ఈ యాత్రలో ప్రజల స్వరం, భావాలు ఉన్నాయని తాము నెమ్మదిగా తెలుసుకున్నట్టు పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరి కోసం భారత్ జోడో యాత్ర ద్వారాలు తెరుచుకునే ఉన్నాయన్నారు. తాము ఎవరినీ అడ్డుకోబోమన్నారు. భారత్ జోడో యాత్ర ఈ నెల 24 దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నది. ఈ క్రమంలో యాత్రకు 9 రోజుల పాటు రాహుల్ గాంధీ బ్రేక్ ఇచ్చారు.