కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మూడో టీఎంసీ కోసం ప్రభుత్వం ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే పనులు చేపట్టిందని దాఖలైన పిటిషన్ పై కోర్టు విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండా పనులు చేపట్టవద్దని ఎన్జీటీ గతంలోనే తీర్పునిచ్చింది.
అయితే, ఆ ఉత్తర్వులను ఉల్లంఘించి మరీ తెలంగాణ సర్కార్ పనులు చేయిస్తుందని తుమ్మలపల్లి శ్రీనివాస్ ఎన్జీటీలో మరో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని కోరారు.