ఆంధ్ర గుండె చప్పుడు కంటెంట్ ఎడిటర్ (నిన్నటిదాకా తెలంగాణ గుండె చప్పుడు అనుకోండి) కంటెంట్ అద్భుతం అని తెలుస్తోంది. ఆయన కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఛానల్ లో పనిచేసేవారికి అనేక సిత్రాలు చూపిస్తున్నాడు అని తొలివెలుగు ఇటీవలే బయట పెట్టింది.
ఆయనకు ఉన్న కంటెంట్ ఎలాంటిదో కూడా చెప్పింది. యాంకర్లకు చుక్కలు చూపిస్తున్నాడని సమచారం. ఎందుకు వాళ్ళను టార్గెట్ చేసి వుంటాడనే చర్చ ఇప్పుడు మొదలైంది. దాంతో కంటెంట్ ఎడిటర్ కంటెంట్ గతంలో ఎలా ఉండేదో చెప్పే విషయాలు బయటకి వచ్చాయి. ఆయన తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేసిన పోస్టులు వాటిపై జరిగిన చర్చలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
స్క్రీన్ షాట్స్ ఇప్పుడు వాట్సప్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో తమను ఎందుకు టార్గెట్ చేస్తున్నాడో అనే విషయం యాంకర్లకు క్లారిటీ వచ్చింది అని సమాచారం. కేసీఆర్ కి ఆంధ్రవాళ్లు ఎందుకు నచ్చారో ఇప్పుడు అర్ధం అవుతోంది అంటున్నారు తెలంగాణ వాదులు. ఆయన దగ్గర కంటెంట్ బాగుందని నచ్చి ఆయనకు కంటెంట్ ఎడిటర్ గా తన గుండెచప్పుడులో పెట్టుకున్నాడని అంటున్నారు తెలంగాణ వాదులు.