చత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా కేంద్రానికి చెందిన నలుగురు కాంట్రాక్టర్లు గత ఎనిమిది రోజులుగా కనిపించడం లేదు. డిసెంబర్ 24న గోర్నాలోని అటవీ ప్రాంతానికి వెళ్లి తిరిగిరాని కాంట్రాక్టర్లు. అప్పటి నుంచి వారి వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
స్థానికులు వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొండగావ్ నివాసితులు నిమేంద్ర కుమార్ దేవాన్, నీల్‌చంద్ నాగ్, లోహందీగూడ నివాసి టెమ్రు నాగ్, అలాగే బర్సూర్ నివాసి చప్డి బత్తయ్య అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కుటుంబ సభ్యులు.
కాంట్రాక్టర్‌ల ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన. మావోయిస్టులు కిడ్నాప్ చేసివుంటే సురక్షితంగా వదిలి పెట్టాలని వేడుకుంటున్న కుటుంబ సభ్యులు.