ఒకప్పుడు తల్లి కావడం అనేది ఒక గౌరవంగా భావించే వారు. ఏ స్థాయిలో ఉన్న వారు అయినా సరే అమ్మ అని పిలిపించుకోవడానికి ఎన్నో పూజలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాని ఇప్పుడు మాత్రం తల్లి కావడాన్ని అవమానంగా భావించడమే కాదు కెరీర్ కంటే అమ్మ అనే మాట పెద్ద గొప్పది కాదు, నవ మాసాలు మోయడం పెద్ద విశేషం కాదని భావించడం ఆందోళన కలిగించే అంశం. ఒకప్పుడు పెళ్లి తర్వాత నవ మోసాలు మోసి పిల్లలను కంటే ఇప్పుడు సరోగసి ద్వారా పెళ్లి అయిన మూడు నాలుగు నెలలకే తల్లి అవుతున్నారు. వాళ్ళ జీవితం వాళ్ళ ఇష్టమే అయినా ఇలా వివాదాస్పదం అయిన ఇద్దరు హీరోయిన్ల గురించి చూద్దాం.
నయనతార
ఈమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఏడాదే పెళ్లి చేసుకుని ఈ ఏడాదిలో నాలుగు నెలల్లో తల్లి అయింది. అది వివాదంగా మారుతుందని అందరూ భావించారు. కాని వాళ్ళు పుట్టింది దుబాయ్ లో అనే వార్తలు వచ్చాయి. దీనితో తమిళనాడు ప్రభుత్వం కూడా సైలెంట్ అయింది.
అలియా భట్
రణబీర్ కపూర్ ని ప్రేమించి వివాహం చేసుకున్న ఈ అమ్మడు 7 నెలలకే తల్లి అయింది. అప్పటికే ఆమె గర్భవతి కావడంతో తక్కువ కాలంలోనే తల్లి అయింది. ఇది సరోగసి కాకపోయినా ఫాన్స్ నుంచి విమర్శలు ఎదుర్కొంది.