ఖైరతాబాద్ నియోజకవర్గం బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ కు బెదిరింపులు వచ్చాయి. వ్యక్తిగత దూషణలకు దిగడంతో పాటు అంతు చూస్తాం అంటూ వాట్స్ అప్ వేదికగా జూబ్లీహిల్స్ కార్పొరేటర్ సోదరుడు వెల్దండ రమేష్ బెదిరింపులకు దిగారు. దీనితో బంజారాహిల్స్ పోలీసులకు పల్లపు గోవర్ధన్ ఫిర్యాదు చేశారు.
ఫిలిం నగర్ అభయాంజనేయ స్వామి వ్యవహారంలో కార్పొరేటర్ వర్గానికి ..పల్లపు గోవర్ధన్ వర్గానికి మధ్యన విభేదాలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. తాజాగా కార్పొరేటర్ సోదరుడి బెదిరింపులతో బీజేపీలో విభేదాలు తెరపైకి వచ్చాయి.