సింగర్ మంగ్లీ వివాదంలో చిక్కుకుంది. శ్రీకాళహస్తి ఆలయంలో ఓ పాటను చిత్రీకరించిన నేరం మంగ్లీ మెడకు చుట్టుకుంది. గత 20 ఏళ్లుగా శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంలో వీడియో చిత్రీకరణకు అనుమతి లేదు.
అలాంటిది, ఆలయంలో మంగ్లీ పాటను చిత్రీకరించడం తీవ్ర విమర్శలకు దారితీసింది. మంగ్లీ ప్రతి ఏటా శివరాత్రి సందర్భంగా ఓ ప్రైవేట్ సాంగ్ ను రికార్డు చేసి విడుదల చేస్తుంటుంది. ఈ ఏడాది ఆమె శ్రీకాళహస్తీశ్వరాలయంలో ‘భం భం భోలే’ పాటను షూట్ చేసింది.
ఇక్కడి కాలభైరవ స్వామి ఆలయం, అమ్మవారి సన్నిధి, స్ఫటిక లింగం, రాయల మంటపం, రాహుకేతు మంటపం, ఊంజల్ సేవా మండపం వద్ద ఈ పాట చిత్రీకరణ జరిపినట్టు తెలుస్తోంది.
ఆలయంలో షూటింగ్ జరిపేందుకు మంగ్లీకి అనుమతులు ఎలా లభించాయన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.