తలైవి సినిమాకు హైదరాబాద్ నుంచి అక్రమంగా నిధులు తరలింపు జరిగింది అంటూ ఆరోపించారు విబ్రి మీడియా కార్తీక్. జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే నిధులు
మల్లింపు పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు కార్తీక్. నిర్మాత విష్ణు వర్ధన్ ఇందూరి , బ్రిందా ప్రసాద్ యాక్సిస్ బ్యాంక్ పై కూడా విబ్రి మీడియా కార్తీక్ ఫిర్యాదు చేశారు.
తనకు తెలియకుండానే కుట్ర పూరితంగా మోసం చేస్తూ 75 లక్షలు బదిలీ చేశారని కార్తీక్ పేర్కొన్నారు. ఐ.పీ.సి. 405,406,415,417,418, 420 సెక్షన్స్ కింద వారి పై కేసు నమోదు చేయాలని విజ్నప్తి చేశారు. విబ్రి మీడియా నుంచి విబ్రి మోషన్ ఫిక్చర్స్ కి మల్లింపు జరిగిందని… నెల 6న ఫిర్యాదు చేశారు కార్తీక్.