కొత్త సినిమాల్లో కొన్ని నేరుగా ఓటీటీలో విడుదల అవుతుండటం వివాదానికి దారి తీస్తోంది. థియేటర్లు తెరుచుకుంటున్నా.. కొందరు నిర్మాతలు ఓటీటీల వైపే మొగ్గుచూపుతుండటంపై ఎగ్జిబిటర్లు గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా టక్ జగదీష్‌పై రచ్చ మొదలైంది.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న టక్ జగదీశ్ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఇప్పటికే నిర్మాతలు ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ 10న రాబోతోందని ఇప్పటికే అనౌన్స్‌మెంట్ కూడా చేశారు. అయితే అదే రోజలు థియేటర్లలో అక్కినేని నాగచైతన్య మూవీ లవ్ స్టోరీ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో అదే రోజు టక్ జగదీష్‌ను ఓటీటీలో విడుదల చేస్తే.. లవ్ స్టోరీ వసూళ్లపై ప్రభావం చూపుతుందని ఎగ్జిబిటర్లు ఆరోపిస్తున్నారు. టక్ జగదీష్ రిలీజ్ డేట్‌ను మార్చుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే భవిష్యత్తులో నాని సినిమాలను థియేటర్లలో విడుద కాకుండా అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.