ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పురస్కారం ఇవ్వడం వివాదంగా మారింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చాగంటి కోటేశ్వరరావుకు పురస్కారం ఇవ్వడంతో.. విజయనగరంలో కవులు, కళాకారులు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా విజయనగరంలోని గురజాడ సాహిత్య సాంస్కృతిక సమాఖ్య గురజాడ పురస్కారాన్ని అందిస్తుంది. ఇప్పటి వరకూ ఎందరో కళాకారులకు, కవులకు ఈ పురస్కారం అందించారు. అయితే ఎప్పుడూ గురజాడ పురస్కారం వివాదం కాలేదు.
అయితే ఈసారి ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుకు గురజాడ పుష్కరం ఇవ్వడం పట్ల జన విజ్ఞాన వేదిక కవులు, కళాకారులు తప్పుపడుతున్నారు. గురజాడ భావ జాలానికి భిన్నమైన చాగంటి కోటేశ్వర రావుకు ఈ అవార్డు అందించడంపై కవులు, రచయితలు, కళాకారులు మండిపడుతున్నారు. చాగంటి కోటేశ్వర రావుకు తాము వ్యతిరేకం కాదని.. అయితే ఈ అవార్డును ఆయనకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని వారు పేర్కొంటున్నారు.
ఆధ్యాత్మికవేత్త ఆయన చాగంటికీ అభ్యుదయ వాది అయిన గురజాడ పురస్కారం ఇవ్వడమేంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా పలువురు సినీ రంగంలోని వారికి గురజాడ పరుస్కారాలు అందించిన విషయంలో కూడా తాము వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు నిరసనకారులు.
గురజాడ అప్పారావు ఇంటి నుంచి కవులు, కళాకారులు, రచయితలు ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ అవార్డుపై చాగంటి కోటేశ్వర్ రావు స్పందించారు. గురజాడ అంటే ఆయనకి గౌరవమని, అందుకే ఈ అవార్డును ఇస్తామంటే అంగీకరించినట్లు ఆయన తెలిపారు. ఇలాంటి వివాదం తలెత్తుతుందని తాను ఊహించలేదన్నారు చాగంటి.