మెగాస్టార్ చిరంజీవి నటించిన 154 వ చిత్రం వాల్తేర్ వీరయ్య సంక్రాంతి కానుకగా రాబోతుంది. మెగాస్టారంటే మామూలుగానే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బాలయ్య హీరోగా వస్తున్న సినిమా వీరసింహారెడ్డితోబాటు సంక్రాంతి బరిలోకి దిగడం మరింత ఉత్యంఠను పెంచింది.
ఇప్పటికే వీరయ్య సినిమా పాటలు రిలీజ్ అయ్యి, ఫ్యాన్ కి ఓ రేంజ్ జోష్ ఇస్తున్నాయ్. ఇటీవల మూడోపాటగా రిలీజ్ అయిన వాల్తేర్ వీరయ్య టైటిల్ సాంగ్ దుమ్ములేపుతోంది. అయితే చంద్రబోస్ రాసిన ఈ పాట సాహిత్యం విషయంలో విమర్శలు ఎదుర్కొంటోంది.
షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి సిద్ధంగా ఉన్న ఈ సినిమా టైటిల్ సాంగ్ పై ప్రముఖ నవలా రచయిత వ్యక్తిత్వ వికాస నిపుణుడు యండమారి విమర్శించారు. వీరయ్య టైటిల్ సాంగ్ రాసిన చంద్రబోస్ ఏ పురాణ కథలు చదివి ఈ పాటరాసారని విమర్శించారు.
కచ్చితంగా ఇది శివ దూషణే అవుతుందని యండమూరి విమర్శించారు.దీనికి చంద్రబోస్ ధీటుగా కౌంటర్ ఇచ్చారు .అధ్యయనం చేయాల్సిన పాటను అవమానించొద్దన్నారు. అభినందించడం మాని నిందించడం సరికాదన్నారు.
అర్థం తెలియకుండా మాట్లాడే వాళ్ళకు ఏం చెబుతామని యద్దేవా చేసారు. 30 యేళ్ళ కిందటే ఇలాంటి పదప్రయోగం చేసానని గుర్తుచేసారు. నిజానికి ఆ పాటలో మెగాస్టార్ క్యారెక్టర్ని కీర్తించడంలో బోసు డోసు పెంచినమాట వాస్తవమే, వివాద రహితుడిగా ముక్కుమూసుని తపస్సుచేసుకునే వశిష్ఠ మహామునిని పాటలోకి లాగారు.
వినడానికే రాసి..ఎవరు వింటార్లే అని రాశులుగా పలువురు గీతరచయితలు రాసుకుపోతున్న తరుణంలో యండమూరి లాంటి రచయితలు ప్రశ్నించడంలో అర్థం ఉంది.అర్థం తెలియకుండా విమర్శించేందుకు వారు అన్ని నవలలు రాయనక్కర్లేదని యండమూరి అభిమానుల మనోగతం. ఆ మాటకొస్తే పలువురు ఆయననూ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి.
సాహిత్యానికి సామాన్యులు ఆహా ఓహో అనొచ్చు కానీ విషయం తెలిసిన వాళ్ళు విమర్సిస్తే విషయం వేరుగా ఉంటుంది. చంద్రబోస్ కౌంటర్ కి యండమూరి ఎలా ప్రతి స్పందిస్తారో చూడాలి.