కేటీఆర్ ఇలాకలో కూలిన నిర్మాణంలోని వంతెన
మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నరాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్మాణంలో ఉన్న ఓ వంతెన కూలిపోయింది. వేములవాడ మూలవాగుపై ప్రభుత్వం వంతెన నిర్మాణం చేపట్టింది. దాదాపు 20 కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వం ఈ బ్రిడ్జీ నిర్మాణాన్ని చేపట్టగా… గత మూడు రోజులుగా కూరుస్తున్న వర్షాలతో మూలవాగు పొంగిపోర్లుతుంది. దాంతో… బ్రీడ్జీ నిర్మాణానికి వేసిన పిల్లర్లు కొట్టుకపోయాయి.
అయితే… నిర్మాణంలో నాణ్యత లోపించటమే అసలు కారమణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. వందల సంవత్సరాల క్రితం కట్టిన కట్టడాలు ఇప్పటికీ చెక్కు చెదరటం లేదని, కానీ ఒక్క సారి వాగు పొంగినంత మాత్రాన… ఇలా బ్రిడ్జీ కొట్టుకపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.