మంత్రిగా ఉన్న కేటీఆర్ సీఎంగా ప్రమోషన్ పొందనున్నారా…? కేటీఆర్ సీఎం కావాలని కోరుతున్న టీఆర్ఎస్ నేతల కకల నిజం కానుందా…? ఫిబ్రవరిలో యాదాద్రి గుడి రీ-ఓపెనింగ్ తర్వాత సీఎం కుర్చీ మారనుందా…? కేటీఆర్ కోసం అత్యాధునిక వాహన శ్రేణిని అధికారులు రెడీ చేస్తున్నారా…?
మొత్తం 10కార్లు. అన్నీ బుల్లెట్ ప్రూఫ్. ఇందులో రెండు రక్షణ శాఖలో ఉండే తరహా వాహనాలు. శత్రువులు దాడి చేస్తే.. కార్లో నుండే ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నవి. ఒక్కో కారు ధర కోటిన్నర. వాహనాలు సిద్ధం చేయాలంటూ ఇప్పటికే సీఎంవో నుండి అధికారులకు ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో కేటీఆర్ సీఎం అన్న మాట కన్ఫామ్ అయినట్లే.
పేలుడు పదార్థాలను ముందే పసిగట్టడం, శత్రువుల దాడుల నుండి సేఫ్ గా భయటపడేలా చూడటం ఈ వాహనాల ప్రత్యేకత. సీఎం కేసీఆర్ ప్రస్తుతం వాడుతున్న టయోటా లాండ్ క్రూజర్ వాహనాలే కొత్తవి కూడా. కానీ మరింత అధునాతనంగా రాబోతున్నట్లు ఇంటలిజెన్స్ అధికారులంటున్నారు.
ఫిబ్రవరి 17 తర్వాత యాదాద్రిలో మహా సుదర్శనయాగం చేసి గుడిని రీఓపెన్ చేయనున్నారు. ఆ యాగం పూర్తైన తర్వాత కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తారన్న ప్రచారం సాగుతుంది.