తన కొడుకు చేసిన పనికి తప్పైందని, సాయం చేయండని ఓ 50ఏళ్ల మహిళ ఆ ఊరు గ్రామపంచాయితీ పెద్దల వద్దకు వెళ్లింది. ఆ పంచాయితీ పెద్దలిద్దరు ఇదే అదునుగా భావించి… మీ కుటుంబాన్ని వెలి నుండి తప్పిస్తామని నమ్మ బలికి తమ లైంగిక వాంఛ తీర్చమని ఆత్యాచారం చేశారు. గుజరాత్ రాష్ట్రంలోని ఓ కాప్ పంచాయితీలో జరిగిన ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తమ కొడుకును చేసిన తప్పును క్షమించి వెలి నుండి రక్షించాలని ఆ మహిళ కులపెద్దలైన రాంచోద్భాయ్, వోల్భాయ్ సుతార్‌ల వద్దకు వెళ్లింది. దీంతో వారు ఆమెపై ఆత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా నెల రోజులుగా వేధింపులకు గురిచేస్తూనే ఉన్నారు. దీంతో ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది.