హైదరబాద్ గండిపేట్ లోని “పెబల్ సిటీ”లో విషాదం గత ఏడాది ఫిబ్రవరి 11 న మొనీష్ అనే 1వ తరగతి పిల్లాడు స్నేహితులతో కలిసి రోడ్డు పై ఆడుతుండగా కరేట్ షాక్ కొట్టి చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక్కడ దురదృష్ట కర విషయం ఏంటంటే ఆ పిల్లాడు ఆడుతూ ఆడుతూ కరెంట్ పోల్ పట్టుకున్నాడు. అంతే కరెంట్ షాక్ కొట్టడంతో కదలిక ఆగిపోయింది. నిమిషాల్లోనే చిన్నారి మూసిన్ అక్కడికక్కడే ప్రాణం వదిలేశాడు. నిర్వహకుల నిర్లక్ష్యం కారణంగా బాలుడు మరణించాడని అప్పట్లో పోలీసులు ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. కానీ ఛార్జ్ షీట్ లో బిల్డర్లు, నిర్వాహకుల పేర్లు తొలిగించటంపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోస్ట్ మార్టంలో కూడా మొనీష్ కరెంట్ షాక్ తో చనిపోయాడని, ప్రమాదం జరిగిన సమయంలో చిన్నారి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని రిపోర్ట్స్ లో స్పష్టంగా వచ్చినప్పటికీ చర్యలు తీసుకోలేదని కురుతుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.