భారతీయ మూడో టీకా కోర్బే వ్యా్క్స్ ఎంతో సురక్షితమైందని ఇమ్యూనైజేషన్ పై ఏర్పాటైన జాతీయ సాంకేతిక సలహా విభాగం చైర్మన్ డాక్టర్ ఎన్ కే అరోరా తెలిపారు. దీనితో మంచి ఇమ్యూనిటీ లభిస్తుందని, శరీరానికి అధిక స్థాయిలో యాంటీబాడీలు అందుతాయని వెల్లడించారు.
‘ ప్రొటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్లు ఎంతో సురక్షితమైనవి. ఇందులో రోగ నిరోధకత బాగా ఉంటుంది. ఎంఎన్ఆర్ఏ, వెక్టార్ వ్యాక్సిన్లతో పోల్చితే లోకల్ రియాక్షన్లు తక్కువగా ఉంటాయి. వెక్టార్ వ్యా్క్సిన్లతో పోల్చినప్పుడు ఇది చాలా వరకు అధిక యాంటీ బాడీ స్థాయిని అందిస్తుంది” అని అన్నారు.
‘ కోర్బేవ్యాక్స్ ను ప్రోటీన్ సబ్ యూనిట్ అంటారు. ప్రస్తుతానికి మన దగ్గర హెపటైటీస్ లాంటి వ్యాక్సిన్లు మన దగ్గర ఉన్నాయి. 12 నుంచి 18 ఏండ్ల వారికి అత్యవసర వినియోగానికి కోర్బెవ్యాక్స్ కు సోమవారం అనుమతులు వచ్చాయి” తెలిపారు.
‘ క్లీనికల్ ట్రయల్స్ సమయంలోనూ వివిధ సమూహాలపై ప్రయోగించినప్పుడు ఇది అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కాబట్టి అందుకే దీన్ని కోర్బె వ్యాక్స్ ను ప్రోటీన్ సబ్ యూనిట్ వ్యాక్సిన్ అని చెబుతున్నాను” చెప్పారు.