కాంగ్రెస్ వార్ రూం కేసుపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కాంగ్రెస్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు సునీల్ కనుగోలు పేరును ఏ1గా చేర్చాలంటూ న్యాయస్థానాన్ని పోలీసులు కోరారు. ఈ మేరకు న్యాయస్థానాన్ని పోలీసులు అనుమతులు కోరారు.
వీడియో స్పూఫ్‌కు సునీల్ కనుగోలుకు ఎటువంటి సంబంధమూ లేదని సునీల్ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అందువల్ల పోలీసులు ఇచ్చిన నోటీసులపై స్టే ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
కాంగ్రెస్ వార్ రూమ్‌కు సునీల్ కనుగోలుకు ఎలాంటి సంబంధమూ లేదని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ కేసులో సునీల్‌ను అక్రమంగా ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని న్యాయవాది పేర్కొన్నారు.
ఈ కేసును కొట్టివేయాలని హైకోర్టును ఆయన కోరారు. ఈ కేసులో వాదనలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో తీర్పును సోమవారం వెల్లడిస్తామంటూ కేసును వాయిదా వేసింది.