తెలంగాణలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. క్రమక్రమంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18కు చేరింది. కొత్తగా కరోనా లక్షణాలు భయటపడ్డ వారు కూడా విదేశాల నుండి వచ్చిన వారేనని అధికారిక వర్గాలు ప్రకటించాయి. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసులున్న రాష్ట్రాల మొదటి 5 జాబితాలో తెలంగాణ చేరింది.
లండన్ నుండి హైదరాబాద్ కు వచ్చిన ఇద్దరిలో కరోనా లక్షణాలు భయటపడగా… పరీక్ష నిర్వహించామని, వారికి కరోనా పాజిటివ్ ఉందని తెలంగాణ కుటుంబ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
అయితే, కరోనా పాజిటివ్ వచ్చిన 18మంది పరిస్థితి ఆందోళనకరంగా ఏమీ లేదని, అందరూ కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 200దాటడం ఆందోళన కలిగిస్తోంది.