కరోనా వైరస్ బారిన పడి, కోలుకున్న వారిలో రోగ నిరోధక శక్తి సుదీర్ఘకాలం ఉంటుందన్నది తెలిసిందే. అయితే, ఈ రోగ నిరోధక శక్తి 2-3నెలల పాటు మాత్రమే ఉంటుందని ఇప్పటి వరకు పలు పరిశోధనలు వెల్లడించగా… 8నెలల వరకు నిశ్చితంగా ఉండొచ్చని ఆస్ట్రేలియన్ యూనివర్శిటీ ప్రకటించింది.
ఇమ్యూనాలజీ జర్నల్ కథనం ప్రకారం… రోగ నిరోధక వ్యవస్థలోని మెమొరీ బీ కణాలు వైరస్ దాడికి గురైన పరిస్థితులు గుర్తించుకని, మళ్లీ కరోనా బారిన పడకుండా యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. 25 మంది కొవిడ్ రోగుల్లో 4వ రోజు నుంచి 242 రోజుల మధ్య 36 రక్తనమూనాలు సేకరించి శాస్త్రవేత్తలు ఈ అధ్యయనం చేయగా, కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ రోగ నిరోధక శక్తి అత్యంత త్వరగా తగ్గిపోతుందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ పరిశోధన ఫలితాలు రావటం ఊపిరి పీల్చుకునేలా చేస్తున్నాయి.