కరోనా మహమ్మారి గత ఏడాదిన్నర కాలంగా ప్రపంచాన్ని వణికించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే రెండు సార్లు లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ వంటి నిబంధనలతో ప్రజలు తెగ ఇబ్బంది పడ్డారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ నిబంధనలు వర్తించాయి. కొన్ని చోట్ల ఇంకా కొనసాగుతున్నాయి కూడా. కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వాలు ఈ దిశగా నిర్ణయం తీసుకున్నాయి.
అయితే ప్రైవేట్ కంపెనీలు మాత్రం ఈ లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు ఆఫీస్ కు రాలేరు కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సదుపాయాన్ని కల్పించించాయి. దీంతో చాలామంది సంతోషంగా ఇళ్ళ నుండి పని చేయడం ప్రారంభించారు.
ప్రస్తుతం కోవిడ్ 19 ఎఫెక్ట్ చాలావరకు తగ్గిపోవడంతో తో ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకు రావలసిందిగా ఆర్డర్ చేస్తున్నాయి.
కొంతమంది చాలా హ్యాపీగా ఆఫీస్ కి వెళ్తుంటే, మరికొంతమంది తప్పక ఉసూరుమంటూ ఇంటి నుంచి బయలుదేరుతున్నారు. కానీ మరికొంతమంది మాత్రం ఇప్పటికీ ఇంటి నుంచి పని చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారట. కాదు కూడదు అని కంపెనీ యాజమాన్యం అంటే మాత్రం ఉద్యోగాన్ని వదులుకోవడానికి అయినా సిద్ధపడుతున్నారట. ఓ ఇంటర్నెట్ బ్రాడ్ బ్యాండ్ కంపెనీ ఆగస్టులో లక్షల మంది భారతీయ ఉద్యోగులపై సర్వే చేపట్టి ఈ విషయాన్ని వెల్లడించింది.