దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్థిరంగానే కొనసాగుతోంది. దాదాపు రెండువారాలుగా రోజువారీ కేసులు 15 వేలలోపే నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 13,203 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. కరోనా కారణంగా మరో 131 మంది ప్రాణాలు కోల్పోయారు. అటు దాదాపు కొత్త కేసులు సమానంగా13,298 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా నేటి ఉదయం వరకు 16,15,504 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్టు వివరించింది.
మొత్తం కేసులు: 1,06,67,736
యాక్టివ్ కేసులు: 1,84,182
మొత్తం రికవరీలు: 1,03,30,084
మొత్తం కరోనా మరణాలు: 1,53,470
దేశవ్యాప్తంగా నిన్న 5.70 లక్షల మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించినట్టుగా ఐసీఎంఆర్ తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు 19.23 లక్షల మంది శాంపిళ్లు పరీక్షించినట్టుగా వెల్లడించింది.