దేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 50,407 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే.. కరోనా నుండి 1,36,962 మంది కోలుకున్నారని పేర్కొంది.
కరోనా కారణంగా ఒక్క రోజే 804 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ లో వెల్లడించింది. ప్రస్తుతం ఆసుపత్రులు హోం క్వారంటైన్లలో 6,10,443 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది.
కరోనా మృతుల సంఖ్య 5,07,981కి చేరగా.. రోజువారీ పాజిటివిటీ రేటు 3.48 శాతంగా నమోదవుతున్నట్టు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు మొత్తం 172,29,47,688 డోసుల కరోనా వ్యాక్సిన్లు వినియోగించినట్టు తెలిపారు.
కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని నిపుణులు చెప్తున్నారు. కరోనాతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. అందుకు కావలసిన జాగ్రత్తలను పాటించాలని చెప్తున్నారు. ప్రతీ ఒక్కరు రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.