దేశంలో కరోనా మళ్లీ విస్తరిస్తోంది. గత వారం రోజులుగా గమనిస్తే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా తాజాగా 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి.
దేశవ్యాప్తంగా 4.98 లక్షల మందికి కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 20,557 మందికి పాజిటివ్‌గా నమోదైంది. ముందు రోజు 15 వేలు రాగా.. ఒక్క రోజులోనే 5 వేల కేసులు పెరిగాయి.
కొత్తగా నమోదైన మొత్తం కరోనా కేసులు 4,38,03,619. ఇందులో 4,31,13,623 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,785 మంది కరోనాకు బలయ్యారు. మరో 1,45,654 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 18,517 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడి డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మళ్లీ పెరుగుతున్న కరోనా వల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. బయటికి వెళ్తే కచ్చితంగా మాస్క్, శానిటైజర్, భౌతిక దూరం పాటించాలని తెలిపారు. గుంపులుగా ఉండవద్దని సూచిస్తున్నారు.