తెలంగాణలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు భారీగా తగ్గుతున్నాయి. దీంతో పాజిటివ్ కేసులు అమాంతం దిగొస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్టవ్యాప్తంగా 17 వేల 296 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 502 మందికి పాజిటివ్ అని తేలింది. ఇందులో జీహెచ్‌ఎంసీ పరిధిలో 141 కేసులు వెలుగుచూశాయి. నేటి వరకు తెలంగాణలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 2.57 లక్షలకు పెరిగింది. మరోవైపు కరోనా కారణంగా నిన్న ముగ్గురు మృతి చెందారు. మొత్తం మరణాలు 1407కు చేరాయి
రాష్ట్రంలో కరోనా నుంచి నిన్న 1539 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 2.42 లక్షలుగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 14 వేల 385 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 11 వేల 948 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 48.91 లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.