ప్రజల్లో జాగ్రత్త పెరిగిందో.. వైరస్ వ్యాప్తి తగ్గిందో కానీ… దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. కొత్త కేసులతో పాటు యాక్టివ్ కేసులు కూడా భారీగానే తగ్గుతూ వస్తున్నాయి. అలాగే చాలా రోజుల తర్వాత నిన్న మరణాల సంఖ్య కూడా భారీగా పడిపోయింది.
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32 వేల 981 మంది కరోనా బారినపడ్డారు. వీటితో కలిపి దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 96.77 లక్షలకు చేరింది. అటు కరోనా కారణంగా నిన్న 391 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాలు లక్షా 40 వేల 573కు పెరిగాయి. కరోనా బారిన పడిన వారిలో ఇప్పటికే 91.39 లక్షల మంది ఈ మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 3.96 లక్షల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా నిన్న 8 లక్షలకు పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. వీటితో కలిపి ఇప్పటివరకు 14.77 కోట్ల మందికి టెస్టులు చేసినట్టు వెల్లడించింది.