దేశంలో కరోనా వైరస్ ఉధృతి భారీగా తగ్గింది. అతి త్వరలోనే కరోనా ముందునాటి పరిస్థితులు నెలకొంటాయన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12, 584 వేల మంది వైరస్ బారినపడ్డారు. జూన్ 14 న 12,368 కేసులు నమోదు కాగా.. మళ్లీ అంత తక్కువ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక వరుసగా రెండో రోజూ 200లోపే మరణాలు సంభవించాయి. నిన్న కరోనా కారణంగా 167 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో ఇప్పటివరకు 1,04,79,179 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇందులో లక్షా 51 వేల 327 మంది మృత్యువాతపడగా..1,01,11,294 మంది కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 2,16,558 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా నిన్న 8.97 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. కాగా ఇప్పటివరకు 18.26 కోట్ల శాంపిళ్లను పరీక్షించారు.