దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కంట్రోల్‌లోనే ఉంది. చాలా రోజులుగా 20 వేలకు అటు, ఇటుగానే కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 18,177 మంది ఈ వైరస్ బారిపడినట్టు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రకటించింది. కరోనాతో చికిత్స పొందుతూ దేశవ్యాప్తంగా నిన్న 217 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,03,23,965కు పెరిగింది. మరణాల సంఖ్య 1,49,435కు చేరింది. కరోనా నుంచి నిన్న 20,923 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 99,27,310 మంది రికవరీ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 2,47,220 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇదిలా ఉంటే దేశంలో నిన్న 9,58,12 మందికి పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ తెలిపింది. ఇప్పటి వరకు 17.78 కోట్ల శాంపిళ్లను టెస్ట్ చేసినట్టు వివరించింది.