తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గతంలోని పరీక్షల సంఖ్యతో పోలిస్తే.. పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే పడిపోయింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 37,387 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 169 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. కరోనా కారణంగా నిన్న ఒక్కరు మృతి చెందారు. అటు తాజాగా ఈ వైరస్ నుంచి 189 మంది కోలుకున్నారు.
తాజా కేసులతో కలిపి తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య మొత్తం 2,95,270కి చేరింది. ఇందులో ఇప్పటికే 2,91,699 మంది కోలుకున్నారు. అటు ఇప్పటివరకు కరోనా కారణంగా 1,607 మంది మరణించారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు1964గా ఉన్నాయి. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు 80,34,038కి మందికి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.