ప్రజలను వణికిస్తున్న కరోనా మహమ్మారితో కాస్త ఊరటలభించింది. దేశంలో రెండవ రోజు కరోనా కేసులు తగ్గాయి. కొత్తగా 58,077 మందికి కరోనా సోకినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా ఉధృతికి తట్టుకోలేక మరో 657మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. అలాగే.. 24 గంటల్లో 1,50,407 మంది కరోనా నుంచి కోలుకున్నట్టు వెల్లడించింది.
1,50,407 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారని వివరించింది. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 1.64 శాతంగా ఉన్నాయని.. రికవరీ రేటు 97.17 శాతానికి చేరిందని వెల్లడించింది.
దేశంలో కొత్తగా 48,18,867 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటివరకు మొత్తం 1,71,79,51,432 డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 6,97,802 మంది చికిత్స తీసుకుంటున్నారి వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తంగా కరోనా మరణాల సంఖ్య 5,07,177కు పెరిగిందని.. రోజువారీ పాజిటివిటీ రేటు 3.89 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.