రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొన్నటి వరకు జిల్లాల్లోనే కేసుల పెరుగుదల కనపడగా, ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనూ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాష్ట్రంలో కొత్తగా 337 మందికి వైరస్ సోకింది. జీహెచ్ఎంసీ పరిధిలో 91 మంది మహమ్మారి బారిన పడ్డారు. దీంతో కరోనా బారిన పడ్డ మొత్తం బాధితుల సంఖ్య 3,03,455కు పెరిగింది.
వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ మరో ఇద్దరు బలయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1,671 మంది మరణించారు. తాజాగా 181 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,98,826 మంది కొవిడ్‌ను జయించారు. రాష్ట్రంలో 2,958 యాక్టివ్ కేసులుండగా, ప్రస్తుతం 1,226 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
గడిచిన 24గంటల్లో 37,079 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.