దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. గతకొద్ది రోజులుగా 16 వేల వరకు నమోదవుతున్న కేసులు.. తాజాగా దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 పాజిటివ్ కేసులు వెలుగు చూసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కారణంగా నిన్న మరో 91 మంది మృత్యువాత పడినట్టు వెల్లడించింది. ఇక కరోనా బారినుంచి నిన్న 12,464 మంది డిశ్చార్జి అయ్యారు.
తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,11,24,527కు పెరిగింది. ఇందులో ఇప్పటికే 1,07,98,921 మంది కోలుకున్నారు.అటు మొత్తం కరోనా మృతుల సంఖ్య 1,57,248 చేరింది. ప్రస్తుతం దేశంలో 1,57,248 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటి వరకు 1,48,54,136 మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్రం వివరించింది.