దేశంలో కరోనా వైరస్ ఉధృతి మరికొంత తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 31,118 మంది కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడిన వారి సంఖ్య 94.62 లక్షల దాటింది. కరోనా కారణంగా దేశవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే 482 మంది చనిపోయారు. వీటితో కలిపి మొత్తం మరణాలు లక్షా 37 వేల 621కి పెరిగాయి.
కరోనా బారి నుంచి నిన్న 41వేల 985 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 88.89 లక్షల మంది రికవరీ అయినట్టయింది. ప్రస్తుతం దేశంలో 4.35 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.