దేశంలో కరోనా ఉధృతి కొద్ది వారాలుగా ఒకేలా కొనసాగుతోంది. కేసుల్లో హెచ్చూ, తగ్గులూ ఉన్నా మరణాలు మాత్రం అదుపులోకి వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,059 మందిలో కరోనా పాజిటివ్ బయటపడింది. కరోనాకు చికిత్స పొందుతూ నిన్న మరో 78 మంది మరణించారు. అటు నిన్న 11,805మంది డిశ్చార్జి అయ్యారు. ఇక వ్యాక్సినేషన్‌లో భాగంగా ఇప్పటి వరకు 57.75 లక్షల మందికి వ్యాక్సిన్ వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇప్పటివరకూ నమోదైన కేసులు: 1,08,26,363
ఇప్పటికే కోలుకున్నావారు: 1,05,22,601
కరోనాతో మరణించినవారు: 1,54,996
కరోనాతో ఇంకా బాధపడుతున్నవారు: 1,48,766