దేశంలో కరోనా వైరస్ ఉధృతి స్వల్పంగా తగ్గింది. మూడు రోజులుగా 18 వేలకు పైగా నమోదవుతూ వచ్చిన కేసులు స్వల్పంగా దిగొచ్చాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా15,388 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి అటు కరోనా మరణాలు కూడా నిన్నటితో పోలిస్తే తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో చికిత్స పొందుతూ 77 మంది ప్రాణాలు కోల్పోయారు.దేశంలో ఇప్పటివరకు ఒక కోటీ 12 లక్షలకు మందికిపైగా ఇప్పటివరకు కరోనా బారినపడగా.. కోటీ 8 లక్షకు పైగా బాధితులు కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు లక్షా 57 వేల 930 మంది మృత్యువాతపడ్డట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 1,87,462 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 1,08,99,394 మంది వైరస్‌ను జయించగా..ఆ రేటు 96.93 శాతంగా ఉంది.
ఇక తెలంగాణలో గత 24 గంటల్లో 32,189 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా..142 మందికి పాజిటివ్ తేలింది. వీరితో కలిపి మొత్తం కేసులు 3,00,153కి చేరాయి. ఇందులో ఇప్పటికే 2,96,740కి మంది కోలుకున్నారు. ఇక కరోనా కారణంగా నిన్న ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం కరోనా మరణాలు 1644కి పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,769 యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలంగాణ వైద్యారోగ్యశాఖ తెలిపింది.