దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 44,877 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ప్రస్తుతం దేశంలో 5,37,045 మంది కరోనాతో ఆసుపత్రుల్లోనూ.. హోం క్వారంటైన్ల లోనూ చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 3.17 శాతంగా ఉన్నట్టు పేర్కొంది.
గత 24 గంటల్లో కోలుకున్న వారి సంఖ్య 1,17,591 గా ఉన్నట్టు తెలిపింది కేంద్ర ఆరోగ్య సంస్థ. ఇప్పటి వరకు కరోనా మహమ్మారి నుండి మొత్తం 4,15,85,711 మంది రోగులు కోలుకున్నట్టు వెల్లడించింది.
దేశంలో మొత్తం 75.07 కోట్ల కరోనా టెస్టులు చేశారని.. ఒక్క రోజులోనే 14,15,279 కరోనా పరీక్షలు చేసినట్టు తెలిపింది. రానున్న రోజుల్లో కరోనాతో సహజీవనం చేయకతప్పదని పేర్కొంది. ప్రతీ ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య సంస్థ సూచించింది.