తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 43,318 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 417 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. కొత్త కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 82 బయటపడ్డాయి. ఇప్పటివరకు మొత్తం రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 2,88,410కి చేరింది. ఇక నిన్న కరోనాతో ఇద్దరు మరణించారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 1,556కి పెరిగింది.
కరోనా బారి నుంచి తాజాగా మరో 472 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 2,81,872 మంది రికవరీ అయినట్టయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,982యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 2,748 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు తెలంగాణలో 71.04 లక్షల టెస్టులు నిర్వహించారు.