ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటట్లో 42,911 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 282 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 8 లక్షల 80 వేల 712కు చేరింది. కరోనా కారణంగా నిన్న కడప జిల్లాలో ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాలు 7 వేల 92కు పెరిగాయి.
ఏపీలో కరోనా బారినపడినవారిలో ఇప్పటికే 8 లక్షల 69 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం 3700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు ఏపీలో కోటీ 15 లక్షల 74 వేల టెస్టులు నిర్వహించినట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.