దేశంలో గత 24 గంటల్లో 41,810 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,92,920కు చేరుకుందని ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో దేశవ్యాప్తంగా మరో 496 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,696కు చేరుకుంది.
కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 88,02,267కు చేరుకోగా, యాక్టివ్ కేసుల సంఖ్య 4,53,956గా ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 42,298 మంది డిశ్చార్జ్ అయ్యారు.
దేశంలో కరోనా వేవ్ వచ్చే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికలతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి.