దేశంలోనూ కరోనా వైరస్ ఉధృతి మళ్లీ పెరిగింది. నిన్న 15 వేలలోకి పడిపోవడంతో తగ్గిపోయాయని ఊరట చెందేలోపే మళ్లీ 18 వేలకు చేరువయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,921 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇక కరోనాకు చికిత్స పొందుతూ నిన్న మరో 133 మంది మృత్యువాతపడ్డారు.
దేశంలో కరోనాబారినపడిన వారు: 1,12,62,707
కోలుకున్నవారు: 1,09,20,046
యాక్టివ్ కేసులు: 1,84,598
మరణాల సంఖ్య: 1,58,063