అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మరోసారి విజృంభిస్తోంది. దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ లు అధికంగా వ్యాప్తిస్తున్నాయి. ఈ కమ్రంలో గడిచిన నెల రోజుల్లో కరోనా కేసుల సంఖ్య రెండ్లు రెట్లు పెరిగింది.
అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ప్రధానంగా పది కంటే ఎక్కువ రాష్ట్రాల్లో రోజువారీ కేసుల సగటు రెండు వారాల క్రితంతో పోలిస్తే ఈ రోజు రెండు రెట్లు ఎక్కువగా కేసులు నమోదయ్యాయి.
హవాయి, మెయినె, ఫ్యూర్టారికాతో పాటు కొన్ని ప్రాంతాల్లో గతేడాది డెల్లా వేరియంట్ వ్యాప్తితో పోలిస్తే ఇటీవల ఇక్కడ ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇటీవల ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరగడం గమనార్హం.
తూర్పు తీర ప్రాంతంలో ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో ప్రతి రోజూ 19000 మందికి పైగా కరోనాతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. రెండు వారాల క్రితంతో పోలిస్తే ఈ సంఖ్య 20శాతం పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.
వాస్తవంగా చూస్తే గణాంకాల కన్నా ఇంకా ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ప్రతిరోజూ ప్రకటిస్తున్న దాదాపు 73000 కేసులు నిజమైన సంఖ్యలో కొత భాగమేనని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.