ఏపీలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. ప్రభుత్వం విడుదల చేసిన తాజా బులిటెన్ లో మరో 303 కేసులు నమోదు అయ్యాయి. ఒక్క కర్నూలు జిల్లాల్లోనే 74కి పైగా కేసులు నమోదు అవ్వటం కలవరపెడుతోంది. గత ఎనిమిది గంటల్లోనే ఏపీలో 37 కేసులు వచ్చాయి. ఇవన్నీ దాదాపు మార్కజ్ లింక్ ఉన్నవే కావటంతో ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనా వైరస్ కారణంగా ముగ్గురు మరణించారు.
ఇక 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు 11 జిల్లాల్లో కరోనా కేసులు నమోదు అయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఎలాంటి కోరనా కేసులు నమోదు కాలేదు.