కరోనా వైరస్ విషంలా దేశం మొత్తం పాకుతున్న వేళ ఏపీలో కాస్త ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది. ముఖ్యంగా కర్నూల్ జిల్లాలో అత్యధికంగా కరోనా ప్రభావం కనిపిస్తుంది. తాజాగా కర్నూల్ లో చోటు చేసుకున్న ఘటన అధికారుల పనితీరును బయటపెట్టింది. కర్నూలు సర్వజన వైద్యశాలలో రోన శవాలు తారుమారు అయ్యాయి. మార్చురీ నందు ఒకరి మృతదేహానికి బదులు మరొకరి మృతదేహాన్ని బంధువులకు ఇచ్చారు అక్కడున్న సిబ్బంది.
4 రోజుల క్రితం అనారోగ్యంతో కర్నూలు బుధవార పేట కు చెందిన రాంబాబు అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే రాంబాబు మృత దేహానికి బదులు కరోన మృతుడు రామిరెడ్డి మృతదేహాన్ని బంధువులకు సిబ్బంది అప్పగించారు. మా నాన్న మృత దేహం మాకు కావాలని రామిరెడ్డి కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు.