తెలంగాణ సర్కార్ కరోనా వైరస్‌ను ఎదుర్కొంటున్న తీరు తరచూ వివాదాస్పదమవుతూనే ఉంది. రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఓ చోట సర్కార్ నిర్యక్ష్యాన్ని ఎత్తిచూపే ఘటనవెలుగుచూస్తోంది. ఆస్పత్రి నుంచి అత్యంత జాగ్రత్తగా తీసుకువెళ్లాల్సిన కరోనా రోగి మృతదేహాన్ని.. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో శ్మశానవాటికకు తరలించిన ఉదంతం జగిత్యాలలో తాజాగా బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
కరోనా కారణంగా చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని అంబులెన్స్‌లో బదులు ట్రాక్టర్‌లో తరలించారు అక్కడి అధికారులు. ఇప్పటికే చిన్న జ్వరం వస్తేనే తమకు కరోనా వచ్చిందేమోన్న భయంతోనే జనం సగం చచ్చిపోతున్నారు. ఇక ఇలాంటి దృశ్యాలను చూస్తే వారికి హార్ట్ ఎటాక్ వచ్చి కుప్పకూలడం ఖాయం.
No ambulance but Tractor!!
This is how #Covid_19 deceased dead body was taken for cremation in Jagtial of #Telangana. #TelanganaFightsCorona pic.twitter.com/zCz0nPDVTc— Aashish (@Ashi_IndiaToday) August 3, 2020
ఇటీవలే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 100 అంబులెన్సులను టీఆర్ఎస్ నేతలు ఆస్పత్రులకు అందించినట్టు గొప్పలు చెప్పుకున్నారు. మరి అవన్నీ ఎక్కడపోయాయో అని ప్రశ్నిస్తున్నారు జనాలు.