దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతిరోజూ అరలక్షకు తగ్గకుండా కేసులు వెలుగుచూస్తున్నాయి. గత నాలుగు రోజులుగా 60 వేలకుపైగా కేసులు బయటపడగా..ఇవాళ ఆ జోరుకు కాస్త బ్రేక్ పడింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 53 వేల 601 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరో 871 మంది మృతి చెందారు.
తాజా కేసులతో కలిపి దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 22 లక్షల 68 వేల 676కు చేరింది. ఇందులో 15 లక్షల 83 వేల 490 మంది కోలుకోగా.. మరో 6 లక్షల 39 వేల 929 మంది చికిత్స పొందుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కారణంగా మృతి చెందన వారి సంఖ్య 45 వేల 257కు పెరిగింది.
దేశంలో ప్రస్తుతం 28.21 శాతం మాత్రమే యాక్టీవ్ కేసులు ఉన్నాయని.. రికవరీ రేటు 69.80 శాతానికి పెరిగిందని కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది.