దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. దేశంలో లాక్ డౌన్ సమయంలో కేసుల తీవ్రత కాస్త నెమ్మదిగా పెరిగినా, గత వారం రోజులుగా కేసులు విపరీతంగా పెరిగిపోతూనే ఉన్నాయి. మొత్తంగా గత ఐదు రోజుల్లోనే దాదాపు 15వేల కొత్త కేసులు నమోదు కావటం దేశంలో కరోనా విస్ఫోటనానికి అద్దం పడుతోంది.
దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న కేసుల సంఖ్య మరింత పెరుగుతూనే ఉంది. ఆదివారం ఒక్కరోజే 2900 కొత్త కేసులు నమోదు కాగా, 99మంది మరణించారు. తాజాగా సోమవారం ఆ కేసుల సంఖ్య 3900కు చేరగా మృతుల సంఖ్య 195కు చేరింది. దీంతో దేశంలో దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 46,433కు చేరగా, 1568మంది చనిపోయారు. కరోనా నుండి 12,727మంది కోలుకోగా… 32,138మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.
తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహరాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, గుజరాత్, ఢిల్లీ, ఏపీ, బెంగాల్, యూపీ వంటి రాష్ట్రాల్లో కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి.
మహరాష్ట్రలో ప్రతి రోజు 700 నుండి 1100మద్య కొత్త కేసులు వస్తూనే ఉన్నాయి. తమిళనాడు, పంజాబ్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ స్పష్టంగా కనపడుతోంది. ఆ మధ్య కేసులు కాస్త తగ్గినట్లు కనిపించినా… గడిచిన నాలుగైదు రోజులుగా కేసుల సంఖ్య ఆమాంతం పెరిగిపోయింది. అయితే… దేశంలో కరోనా నుండి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశం. దేశంలో కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య తగ్గుతుంది.
రాబోయే రోజుల్లో ఈ కేసుల తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.